Type Here to Get Search Results !

Nadipinchu Naa Naavaa - నడిపించు నా నావా Song Lyrics | SP Balu

పల్లవి:

నడిపించు నా నావా నది సంద్రమున దేవా

నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||


చరణం1:

నా జీవిత తీరమున నా అపజయ భారమున

నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు

నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప

నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||


చరణం2:

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము

ప్రముఖు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము

రక్షించు నీ సిలువ రమణీయలలో

రతాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||


చరణం3:

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి

అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి

ఆశ నిరాశయే ఆవేదనఎదురాయె

ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||


చరణం4:

లోతైన జలములలో లోతున వినబడుట స్వరమ

లోబడుటను నేర్పించి లోపములు సవరించి

లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు

లోపించని అర్పనగా లోకేశ చేయుమయా ||నడిపించు||


చరణం5:

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని

ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ

పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో

ప్రాణంబును ప్రభువు కొరకు పానార్పణము చేయు ||నడిపించు||




Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.