దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే ||దీనుడా||
1. సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే ||దీనుడా||
2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా ||దీనుడా||
3. ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా