పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు //2//
1. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//
స్థలమైన లేదే జన్మకు! //2//
తలవంచే సర్వ లోకము//2//పశు//
2. స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//
ధరియించలేదే ఆయుధం!//2//
వశమాయే జనుల హృదయాలు //2//పశు//
3. పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//
మేఘాలలోనా వెళ్ళినావు! //2//
త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//