ఆరాధించెదను ఆత్మతో నిరతము
ఆరాధ్య దైవమా ప్రభుయేసుని - 2
ఆనంద గానమే మనసారా పాడుచు - 2
అనుదినము స్తోత్రింతు నా యేసుని - 2
1. నరరూపధారుడు పాపరహితుడు
మరణపు ముల్లును విరచిన విభుని - 2
భజియించు స్తోత్రించి ఆరాధించెదను - 2
అల్ఫా ఒమేగా నా యేసుడు - 2
2. హల్లెలూయా అనుచు అర్పింతును నా హృదిని
భజియించి స్తోత్రించి మహిమపరచెదను - 2
ఆరాధించెద ప్రభుని ఆత్మ సత్యములన్ - 2
అందరి ప్రభుడాయనే నా యేసుడు - 2
3. పరలోక రాజ్యమును ధరయందు స్థాపింప
మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయగా - 2
వరదూత ఘనములతో సమకూడి మనమంతా - 2
స్తోత్రగీతములు పాడెదం మన రాజుకు - 2