Type Here to Get Search Results !

Aradhana Sthuthi Aaradhana - ఆరాధన స్తుతి ఆరాధన Song Lyrics | Ravinder Vottepu

 ఆరాధన స్తుతి ఆరాధన (3)

నీవంటి వారు ఒక్కరును లేరు

నీవే అతి శ్రేష్టుడా

దూత గణములు నిత్యము కొలిచే

నీవే పరిశుద్దుడా

నిన్నా నేడు మారని         ||ఆరాధన||


అబ్రహాము ఇస్సాకును

బలి ఇచ్చినారాధన

రాళ్ళతో చంపబడిన

స్తెఫను వలె ఆరాధన (2)


ఆరాధన స్తుతి ఆరాధన (2)

పదివేలలోన అతి సుందరుడా

నీకే ఆరాధన

ఇహ పరములోన ఆకాంక్షనీయుడా

నీకు సాటెవ్వరు

నిన్నా నేడు మారని        ||ఆరాధన||


దానియేలు సింహపు బోనులో

చేసిన ఆరాధన

వీధులలో నాట్యమాడిన

దావీదు ఆరాధన (2)


ఆరాధన స్తుతి ఆరాధన (2)

నీవంటి వారు ఒక్కరును లేరు

నీవే అతి శ్రేష్టుడా

దూత గణములు నిత్యము కొలిచే

నీవే పరిశుద్దుడా

నిన్నా నేడు మారని        ||ఆరాధన||




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.