నీ మోస బ్రతుకు ఈలోక ఆశలు - ఈనాటికైనా మారాలి
క్రైస్తవ పేరు కలిగేమి ఫలము కరుణాళుడగు క్రీస్తు కడకేగవు
కృపకాలమిదెరా క్రూరంబదేల - ఘన రక్షకుని కృపను గమనించుమా
1. బోధలు వినవు నీ బాధలు గనవు - దైవభయము గలిగి గుడికేగవు.
యెహోవాయందే భయభక్తి గలిగి - జీవించువారలే ధన్యులు
2. విశ్వాసినని నీవు విర్రవీగుటయే అవిశ్వాసమోసం అతి ఘోరము
నీ అవివేక హృదయం అంధకారమయము ఆత్మ స్వరూపికి అవమానవు
3. సున్నముకొట్టిన సమాధివలె నీ వున్నావ యేసుని సన్నిధిలో
సర్పసంతానమా నరకశిక్షను తప్పించుకొనుమని ప్రభుదెల్ఫెను
4. కడవరికాలము కలవరపడకు కన్నీటితో యేసు కడకేగరా
ప్రభుయేసు తీర్పుకు పరిపూర్ణ మార్పును కలిగి రక్షణకై కనిపెట్టరా