నీడవలె నా తోడు ఉన్నవాడవే -
కంటి పాపలా నన్ను కాయుచున్నావే [2]
దారిలో నన్నే చూసావా యేసయ్యా -
తోడుగా దూతలసంపవా ఓ... ఓ... ఓ...[2]
యేసయ్యా.....యేసయ్యా.....
యేసయ్యా.....యేసయ్యా [2] ॥నీడవలె॥
1. అంధకారము నను ఆవరించగా -
నా వెలుగు నీవై నన్ను కాయుచున్నావు [2]
అమ్మవలె నా తోడు ఎల్లవేళలా ఉండి -
కంటికి రెప్పలా నన్ను కాయుచున్నావు [2]
అమ్మ ప్రేమ నాపై చూపావా యేసయ్యా -
నాన్నవలె నన్ను లాలించవా ఓ....ఓ... [2]
||యేసయ్యా॥
2. కరువు లేమిలే నన్ను చుట్టుముట్టగా -
నాతోడు నిలచి నన్ను ఆదుకున్నావు [2]
కరువులో పోషించి కృపలో దీవించి -
ఏనలేని మేలులతో నన్ను నింపినావు [2]
జాలిగా నన్నే చూసావా యేసయ్యా -
ప్రేమతో చేరదీసావా..... ఓ.....ఓ..... [2]
||యేసయ్యా||
3. ఎవ్వరు లేక నే ఏడ్చిన వేళ -
నా ఎదుట నిలిచి నేనున్నానన్నావు [2]
సేవలో బలపరచి నన్ను నడిపించి
దినదినము నీ ప్రేమ కుమ్మరించిచావు [2]
బంధువే నీవై ఉన్నావా యేసయ్యా
భయమేమి లేదని అన్నావా ఓ....ఓ....[2]
॥యేసయ్యా॥ ॥నీడవలె॥