నాదు యేసుని ప్రేమ /
మధురాతి మధురమే కాదా
నన్ను మార్చిన ప్రేమ / మరపురానిది కాదా
హల్లెలూయా.. హల్లెలూయా.. ॥2॥
1. పాపపు బ్రతుకులలో నేను /
పరవశించిన సమయంలో
దేవా నిన్ను దూషించుచు /
దూరమైన వేళలలో
ప్రియుడా నన్ను నీ ఆత్మతో /
నడిపించుము ఇలా నిత్యం
దేవా నన్ను నీ ప్రేమతో /
చెంత చేర్చుకున్నావా ॥హల్లెలూయా॥
2. నజరేయుడా నిన్ను చూడాలని
ఆశ మెదిలెను నా మదిలో
సుందరుడా ఒకసారి నా /
ఆశ తీర్చవా మనసార
ప్రియుడా నన్ను నీ ఆత్మతో /
నడిపించుము ఇలా నిత్యం
దేవా నన్ను నీ ప్రేమతో /
చెంత చేర్చుకున్నావా ॥హల్లెలూయా॥